జియో కొత్త చాట్‌ అప్లికేషన్.. ఏడాది పాటు ఫ్రీ

జియో టెలికాం రంగంలో సెన్షన్‌గా రికార్డు ఆఫర్లను ప్రవేశపెట్టింది.

By Srikanth Gundamalla  Published on  30 July 2024 9:30 AM IST
jiosafe app,  chat, video call, safe application,

జియో కొత్త చాట్‌ అప్లికేషన్.. ఏడాది పాటు ఫ్రీ

జియో టెలికాం రంగంలో సెన్షన్‌గా రికార్డు ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఫ్రీ డేటాను అందించింది. ఇప్పటికీ దీని ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ముందు నుంచే ఉన్న ఎయిర్టెల్, వోడాఫోన్‌ వంటి సంస్థలకు గట్టిపోటీ ఇస్తోంది. జియో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ లాంటి కొత్త చాట్‌ అప్లికేషన్‌ను జియో లాంఛ్ చేసింది. ఇదే జియోసేఫ్. ఏడాది పాటు దీన్ని ఉచితంగా అందిస్తారట.

మొబైల్‌ ఫోన్లలో చాలా వరకు వీడియో కాల్స్‌, మెసేజ్‌లు.. ఫొటోలు సెండ్ చేయడానికి వాట్సాప్‌ను వాడుతున్నారు. వాట్సాప్‌కు పోటీకి జియో కొత్త చాట్‌ యాప్‌ను తీసుకొచ్చింది. వీడియో కాల్ చేయడానికి ఈ జియోసేఫ్ యాప్‌ చాలా సురక్షితమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంట్లో మరింత ప్రైవసీ ఉంటుందంటున్నారు. తొలి ఏడాది పాటు ఈ యాప్‌ను ఉచితంగా అందిస్తామని జియో సంస్థ వెల్లడించింది. ఏడాది తర్వాత నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.199తో యాప్‌ అందుబాటులో ఉంటుందట. వీడియో కాలింగ్‌తో పాటు, జియోసేఫ్‌ యూజర్లు టెక్ట్స్ మెసేజ్‌లు కూడా పంపవచ్చు. ఆడియో కాల్స్ చేయొచ్చు.

జియో సేఫ్ యాప్ ద్వారా కస్టమర్ల డేటా సెక్యూర్‌గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. అయితే ఇక్కడ ఉన్న మైనస్‌ పాయింట్‌ ఏంటి అంటే.. జియోసేఫ్ అప్లికేషన్‌ను 5జీ నెట్‌వర్క్‌లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే 4జీ నెట్‌వర్క్‌లలో, జియో సిమ్‌ లేని వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించలేరు. అంతేకాదు ఇండియా పరిధి వరకు మాత్రమే ఈ జియోసేఫ్ యాప్‌ పని చేస్తుంది.

Next Story