ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించిన గూగుల్

Google To Give All Staff Worldwide One Time Bonus Of $1,600 This Year.గూగుల్‌ తమ ఉద్యోగులకు ఊహించని బోనస్ ప్రకటించింది.

By M.S.R  Published on  9 Dec 2021 8:17 AM GMT
ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించిన గూగుల్

గూగుల్‌ తమ ఉద్యోగులకు ఊహించని బోనస్ ప్రకటించింది. ఇప్పటికే 'ఆఫీస్‌ రిటర్న్‌' పాలసీని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు అదనపు స్టాఫ్‌ బోనస్‌ ప్రకటించి మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇందుకు సంబంధించి బుధవారం గూగుల్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ఆఫీసులలో పని చేసే ఉద్యోగులతో పాటు ఎక్స్‌టెండ్‌ వర్క్‌ఫోర్స్‌, ఇంటర్న్స్‌కి కూడా వన్‌ టైం క్యాష్‌ బోనస్‌గా 1,600 డాలర్లు(భారత కరెన్సీలో లక్షా 20 వేల దాకా) అందించనున్నట్లు పేర్కొంది. వర్క్‌ఫ్రమ్‌ హోం అలవెన్స్‌, వెల్‌బీయింగ్‌(సంక్షేమ) బోనస్‌తో పాటు ఈ అదనపు బోనస్‌ అందించనున్నారు.

ఈ ఏడాది మార్చిలో గూగుల్‌ చేపట్టిన అంతర్గత సర్వేలో ఉద్యోగులకు అందుతున్న బెనిఫిట్స్‌ బాగోలేవని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు . దీంతో కంపెనీ హుటాహుటిన వెల్‌బీయింగ్‌ బోనస్‌ కింద 500 డాలర్లు(మన కరెన్సీలో 37వేల రూపాయలకు పైనే) అందించింది. ఇక జనవరి 10, 2022 నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని ఆదేశించిన గూగుల్‌ ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇప్పుడు భారీ బోనస్ ప్రకటించి ఆశ్చర్య పరిచింది.

Next Story