జియో యూజర్లకు గుడ్ న్యూస్
గత కొంతకాలం ముందు టెలికాం రంగాలు రిచార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 10:00 AM ISTగత కొంతకాలం ముందు టెలికాం రంగాలు రిచార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దాంతో.. వినియోగదారులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. వందల రూపాయల్లో ఒకేసారిగా పెరగడంతో అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌టెల్, జియో వంటి దిగ్గజ సంస్థలతో పాటు వొడాఫోన్ ఐడియా కూడా రిచార్జ్ ప్లాన్ ధరలను పెంచేసింది. దాంతో.. చాలా మంది యూజర్లు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూశారు. కొందరు పోర్ట్ ద్వారా మారిపోయారు కూడా. లక్షల కొద్ది కొత్త యూజర్లను బీఎస్‌ఎన్‌ఎల్ సొంతం చేసుకుంది. ఇందులో రిచార్జ్ ప్లాన్‌లు తక్కువగా ఉండటమే కారణం. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్ వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. 4జీ, 5జీ సేవలను విస్తృతం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా జియో తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రిచార్జ్ ప్లాన్ల ధరల్లో భారీ ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీల మధ్య కొన్ని రీచార్జ్ ప్లాన్లపై స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది రూ. 899 (90 రోజులు), రూ. 999 (98 రోజులు). రూ.3,599 (365 రోజులు)తో రీచార్జ్ చేసుకుంటే రూ.700 విలువైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో పది ఓటీటీలు, 3 నెలల జొమాటో గోల్డ్ మెంబర్ షిప్, 2 రోజుల వ్యాలిడిటీతో రూ.175 విలువైన 10 జీబీ డేటా వోచర్‌ను కూడా పొందవచ్చు.