ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితా.. అగ్రస్థానంలో ముఖేశ్ అంబానీ

ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్‌

By Srikanth Gundamalla  Published on  3 April 2024 6:30 PM IST
forbes, richest indian list, mukesh ambani,

ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్‌

ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్‌. ఈ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది 169 మంది భారతీయుల పేర్లు ఫోర్బ్స్‌ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. మొత్తంగా భారత బిలియనీర్ల సంపద 954 బిలియన్‌ డాలర్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే దాదాపు 41 శాతం వీరి సంపద పెరిగింది. కాగా.. మరోసారి దేశంలోని అపర కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తొలి స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద 116 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. సంపద 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి ఇండియన్‌ రిచెస్ట్‌ మ్యాన్‌గా నిలిచారు ముఖేశ్ అంబానీ.

ముశేఖ్‌ అంబానీ తర్వాత 84 బిలియన్ డాలర్ల సంపదతో అందానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఆ త్ఆతి స్థానంలో 36.9 డాలర్లతో శివ్‌నాడార్‌ ఉన్నారు. 33.5 బిలియన్‌ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్ నాలుగో స్థానంలో ఉన్నారు. సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ కావడం విశేషం. మరోవైపు ప్రపంచ టాప్‌-10 సంపన్నుల జాబితాలో భారత్‌ నుంచి ఒక ముఖేష్‌ అంబానీ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో తొమ్మిదవ అత్యంత సంపన్నుడిగా అంబానీ నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ మెుదటి స్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో ఎలాన్ మస్క్, మూడో స్థానంలో జెఫ్ బెజోస్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మార్క్ జుకర్‌బర్గ్, లారీ ఎలిసన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్, ముఖేష్ అంబానీ, లారీ పేజ్ ఉన్నారు.

ఇండియాలో ఉన్న టాప్‌ 10 రిచెస్ట్‌ పర్సన్స్‌ వీళ్లే..

1. ముఖేష్ అంబానీ: 116 బిలియన్ డాలర్లు

2. గౌతమ్ అదానీ: 84 బిలియన్ డాలర్లు

3. శివ్ నాడార్: 36.9 బిలియన్ డాలర్లు

4. సావిత్రి జిందాల్: 33.5 బిలియన్‌ డాలర్లు

5. దిలీప్ షాంఘ్వీ: 26.7 బిలియన్ డాలర్లు

6. సైరస్ పూనావాలా: 21.3 బిలియన్‌ డాలర్లు

7. కుశాల్ పాల్ సింగ్: 20.9 బిలియన్ డాలర్లు

8. కుమార మంగళం బిర్లా: 19.7 బిలియన్లు

9. రాధాకిషన్ దమానీ: 17.6 బిలియన్ డాలర్లు

10. లక్ష్మి మిట్టల్: 16.4 బిలియన్ డాలర్లు

Next Story