ఫ్లిప్‌కార్ట్‌లో 'మొబైల్‌ బొనాంజా సేల్‌'.. స్మార్ట్‌ ఫోన్లపై భారీ తగ్గింపు

Flipkart Mobile Bonanza Sale .. ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా మొబైల్స్ బొఓనాంజా సేల్‌ని ప్రవేశపెట్టింది.

By సుభాష్  Published on  8 Dec 2020 9:38 AM GMT
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్‌ బొనాంజా సేల్‌.. స్మార్ట్‌ ఫోన్లపై భారీ తగ్గింపు

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కొత్తగా మొబైల్స్ బనాంజా సేల్‌ని ప్రవేశపెట్టింది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్‌ మొనాంజా సేల్‌ ద్వారా కొనుగోలు దారుల కోసం అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లను తక్కువ ధరకు అందిస్తోంది. ఈ బొనాంజా సేల్‌ డిసెంబర్‌ 7 నుంచి 10వ తేదీ వరకు కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో షియోమి, రియల్‌మీ, ఆసుస్‌, శామ్‌సంగ్‌, పోకో, ఒప్పో, ఆపిల్‌, ఇతర ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ డీల్స్‌ని తీసుకొచ్చింది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,750 వరకు తగ్గింపు వర్తించనుంది.

- ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌ సందర్భంగా షియోమీ మీ10టీ, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎఫ్‌4, ఆసుస్‌ రాగ్‌ఫోన్‌ 3, మోటో రాజార్‌ (4జీ వెర్షన్‌) వంటి ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపుతో అందిస్తోంది.

- షియోమి మీ10 టీ ఫోన్‌ ఈ సేల్‌ ద్వారా రూ.35,999లకే అదిస్తోంది. దీని అసలు ధర రూ.39,999 ఉంది.

- ఆసుస్‌ రోగ్‌ ఫోన్‌3 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.44,999లభిస్తుంది.

- రెడ్‌మీ 9ఐ 4జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.8,999 నుంచే ప్రారంభం కానుంది.

- రియల్‌ మీ నోర్జో 20 ప్రోపై కూడా వెయ్యి తగ్గింపు అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది.

- ఒప్పో ఏ31 ధర కూడా రూ.10,990కు తగ్గింది.

- మోటో జీ9 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది.

- ఐఫోన్‌ ఎస్‌ఈ64 జీబీ ధర రూ.32,999 నుంచి ప్రారంభం కానుంది.

- శామ్‌సంగ్‌ గెలక్సీ ఎఫ్‌ 41 ధర రూ.15,499 (అసలు ధర రూ.19,999)కు లభిస్తోంది.

- అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్చేంజ్‌ మరియు ఈఎంఐ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

Next Story