ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం.. 'జీ-మెయిల్'కు పోటీగా 'ఎక్స్ మెయిల్'
ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు.
By Srikanth Gundamalla
ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం.. 'జీ-మెయిల్'కు పోటీగా 'ఎక్స్ మెయిల్'
ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఎలన్ మస్క్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎక్స్ మెయిల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు స్వయంగా ప్రకటన చేశారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతుందని అన్నట్లుగా ఆయన కామెంట్స్ చేశారు. అయితే.. ఎక్స్ మెయిల్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారు? కొత్తగా ఉన్న ప్రత్యేకతలు ఏంటో మాత్రం ఎలన్ మస్క్ చెప్పలేదు. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో సంచలంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు అంతా దాదాపు అందరూ గూగుల్ అందిస్తో జీమెయిల్‌ను వాడుతుంటారు. ఆఫీస్ వర్క్స్‌కి కానీ.. ఇతర ఏ పనులకు అయినా జీమెయిల్‌ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా ఓ వార్త వినిపిస్తోంది. జీమెయిల్ త్వరలోనే తన సేవలను నిలిపివేస్తుందనే పుకార్లు వినిపించాయి. దాంతో.. ఎక్స్‌మెయిల్ వస్తుందని ఎలన్ మస్క్ ప్రకటన సంచలనంగా మారింది. జీమెయిల్ ఆగస్టు 1వ తేదీన కనుమరుగు అవుతుందంటూ ఎక్స్ వేదికగా ఒక వార్త ప్రత్యక్షం అయ్యింది.
అయితే.. జీమెయిల్ కనుమరుగు అవుతుందనే వార్తలపై స్వయంగా గూగుల్ స్పందించింది. ఈ వార్తలను కొట్టిపారేసింది. అవన్నీ అబద్ధాలే అంటూ చెప్పేసింది. ఇన్నాళ్లు బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ ఫార్మాట్‌లో జీమెయిల్ సేవలు అందించామనీ.. ఆ సేవలను ఈ ఏడాది నిలిపివేసి త్వరలోనే స్టాండర్డ్ వ్యూలో జీమెయిల్ సేవలు కొనసాగుతాయని వెల్లడించింది. దాంతో.. జీమెయిల్ యూజర్లంతా ఊపరిపీల్చుకున్నారు. కొత్తగా రాబోయే ఎక్స్‌మెయిల్ ఎప్పుడు వస్తుంది. జీమెయిల్‌కు పోటీ ఇస్తుందా? లేదా? అసలు ఎలాంటి ఫీచర్స్ ఎక్స్ మెయిల్‌లో అందుబాటులో ఉంటాయో చూడాలి మరి.
When we making XMail?
— Nate (@natemcgrady) February 22, 2024