బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
దేశంలో ఉన్న ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలతో సతమతం అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 7:15 AM GMTబ్యాడ్‌న్యూస్.. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
దేశంలో ఉన్న ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలతో సతమతం అవుతున్నారు. ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు దేశీయ చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు పెంచాయి. 19 కిలోల సలిండర్‌పై రూ.25.50 పైసలను పెంచాయి. పెరిగిన ధర మార్చి 1వ తేదీ శుక్రవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటన చేశాయి.
ధరల పెంపు తర్వాత ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కమర్షియల్ సిలిండర్ ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,795గా ఉంది. ఇక ముంబైలో రూ.1,749కి చేరింది. కోల్‌కతాలో రూ.1,911గా ఉంది కమర్షియల్ సిలిండర్ ధర. చెన్నైలో రూ.1,960.50 కాగా.. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,027 అధికంగా ఉండటం గమనార్హం. స్థానికంగా ఉన్న పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి.
ఇక ఇళ్లలో వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన క్రమంలో విమానయాన ధరలను కూడా ఆయిల్ కంపెనీలు పెంచాయి. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు ఏటీఎఫ్ ధర ఢిల్లీలో కిలోలీటర్‌కు రూ. 1,01,397కు పెరిగింది.