ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
Bumper offer for airtel customers.. ఎయిర్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. యూజర్లకు ఉచితంగా 11జీబీ ఇవ్వనుంది.
By సుభాష్ Published on 30 Nov 2020 6:13 AM GMTఎయిర్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. యూజర్లకు ఉచితంగా 11జీబీ ఇవ్వనుంది. ఎయిర్‌టెల్ కొత్త 4జీ కస్టమర్లకు లేదా 4జీకి అప్‌గ్రేడ్ అయ్యే వినియోగదారులకు డేటాను ఉచితంగా అందించనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందించనుంది.
కొత్త ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందించే 5జీబీ ఉచిత డేటాను పొందాలంటే యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎయిర్‌టెల్ కొత్త 4జీ కొనుగోలు చేసినా లేదా 4జీకి అప్‌గ్రేడ్ అయ్యి ఉంటే మీరు కొత్త మొబైల్ నంబర్‌తో ఎయిర్‌టెల్ థ్యాక్స్ యాప్లో నమోదు చేసుకోవాలి. ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ 5జీబీ ఉచిత డేటాను 1 జీబీ కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ డేటా అనేది 72 గంటల్లో కొత్త 4జీ కస్టమర్ ఖాతాకు ఈ డేటా జమ అవుతుంది. ఉచిత 5ఈబీ డేటాను పొందడానికి కొత్త మొబైల్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్‌కు వెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 1జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రిడిట్ అయిన 90రోజుల్లో గా రిడీమ్ చేసుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 5జీబీ డేటాకు బదులు 2జీబీ డేటా వస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ వినియోగదారులుఎవరైతే అన్‌లిమిటెడ్ ప్యాకేజీని తీసుకుంటారో వారికీ ఉచితంగా 6జీబీ డేటా వరకు అందిస్తుంది.