ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులు కేవలం 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అయితే.. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, సాధారణ సెలవులతో పాటు పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఫిబ్రవరిలో దాదాపు 11 బ్యాంకులకు
సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో పనులు ఉన్నవారు ఈ మేరకు సెలవుల విషయం తెలుసుకోవడం మంచింది.
ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే:
ఫిబ్రవరి 4వ తేదీ: ఆదివారం
ఫిబ్రవరి 10వ తేదీ: రెండవ శనివారం
ఫిబ్రవరి 11వ తేదీ: ఆదివారం
ఫిబ్రవరి 14వ తేదీ: బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో సెలవు)
ఫిబ్రవరి 15వ తేదీ: లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు)
ఫిబ్రవరి 18వ తేదీ: ఆదివారం
ఫిబ్రవరి 19వ తేదీ: ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు)
ఫిబ్రవరి 20వ తేదీ: రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం
ఫిబ్రవరి 25వ తేదీ: ఆదివారం
ఫిబ్రవరి 26వ తేదీ: న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు)