ఏటీఎం విత్ డ్రా ఛార్జీల బాదుడు మొదలైంది
ATM cash withdrawal charges to increase from today.ఏటీఎం కార్డ్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే కాస్త ఎక్కువగానే
By M.S.R Published on 1 Jan 2022 10:15 PM ISTఏటీఎం కార్డ్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే కాస్త ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. 2022 జనవరి 1 నుంచి ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసే విషయంలో కొన్ని కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. బ్యాంక్‌లు ఏటీఎంల విషయమై ఇచ్చిన ఫ్రీ ట్రాన్సాక్షన్ పరిమిత లిమిట్ దాటితే ఛార్జీలు వేస్తాయి. నేటి నుండి ఏటీఎం అదనపు ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలంటూ గతంలోనే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
ఏటీఎం అదనపు ట్రాన్సక్షన్స్ పై.. ఒక్కో అదనపు ట్రాన్సక్షన్‌కు రూ. 20 అలాగే జీఎస్‌టీ ఉండేది. ఇప్పుడు రూ. 21 అలాగే జీఎస్‌టీ ఉంటుంది. ఇక సొంత బ్యాంక్ ఏటీఎంలలో ఒక నెలకు ఐదు ఫ్రీ ట్రాన్సక్షన్స్ చేసుకోవొచ్చు. ఇంటర్ ఛేంజ్ ఫీజును 15 రూపాయల నుంచి 17 రూపాయలకు పెంచుకునేందుకు కూడా బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే అనుమతి ఇచ్చింది. ఒక బ్యాంక్ కస్టమర్ మరో బ్యాంక్ ఏటీఎంలో (ATM) డబ్బులు విత్ డ్రా చేస్తే ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది.
ఇక నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలపై ఇంటర్‌ఛేంజ్ ఫీజును ఆరు రూపాయలకు పెంచింది. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరగడంతోనే ఛార్జీలను పెంచినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఏటీఎం ఛార్జీల రివ్యూ కోసం 2019, జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని నియమించింది. వివిధ అంశాలపై రివ్యూ పూర్తయ్యాక ఏటీఎం ట్రాన్సక్షన్స్ పై ఆర్బీఐ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు వసూలు చేయనున్నారు.