అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లు.. ఈరోజు కాస్త అలర్ట్ గా ఉండండి

Amazon Prime membership charges will change from tomorrow.భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర

By M.S.R  Published on  13 Dec 2021 12:14 PM IST
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లు.. ఈరోజు కాస్త అలర్ట్ గా ఉండండి

భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర రేపటి నుండి (మంగళవారం, డిసెంబర్ 14) 50 శాతం వరకు పెరగనుంది. అమెజాన్ ప్రైమ్ సేవలకు సంబంధించిన నెలవారీ, త్రైమాసిక మరియు వార్షిక సబ్‌స్క్రిప్షన్ లు భారీగా పెరగనున్నాయి. ఫలితంగా, వినియోగదారులు వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్ రూ. 1,499కు చేరనుంది. గతంలో దీని ధర రూ. 999 ఉండేది. నెలవారీ మరియు త్రైమాసిక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలలో కూడా ఇలాంటి మార్పులు ఉండనున్నాయి.

భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యొక్క కొత్త ధర డిసెంబర్ 14 ఉదయం 12 గంటల నుండి అమలులోకి వస్తుంది. ఈలోపు కస్టమర్‌లు పాత ధరను ఎంచుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం ఇప్పుడున్న రూ. 999 నుంచి రూ. 1,499 లకు పెరుగుతుంది. కొత్త ధరలు డిసెంబర్ 14 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే కస్టమర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్‌ను పాత ధరలకు (అంటే సంవత్సరానికి రూ. 999) డిసెంబర్ 13 అర్ధరాత్రి వరకు చేసుకోవచ్చు. అమెజాన్ కొత్త ధరలు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్యాక్‌లన్నింటికీ వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్ నెలవారీ ప్యాక్ ఇప్పుడు రూ. 129 లకు బదులుగా రూ.179 లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు రూ. 329 గా ఉన్న మూడు నెలల ప్యాక్.. ఇక నుంచి రూ. 459 లకు పెరిగింది. అయితే, డిసెంబర్ 13, 2021 రాత్రి 11.59 గంటల వరకు కూడా ప్రస్తుతం ఉన్న ధరల ప్యాక్‌లే ఉంటాయి.

అమెజాన్ భారతదేశంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలను పెంచుతున్నప్పటికీ, సబ్‌స్క్రిప్షన్ యొక్క ప్రయోజనాలు అలాగే ఉన్నాయి. అర్హత గల చిరునామాలలో ఒకటి నుండి రెండు రోజుల లోపు డెలివరీలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత ప్రామాణిక డెలివరీకి కనీస ఆర్డర్ విలువ అవసరం లేదు. మెంబర్‌షిప్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు ప్రైమ్ రీడింగ్‌కి కూడా యాక్సెస్‌ని అందిస్తుంది. సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లో భాగంగా కస్టమర్‌లు ప్రతిరోజూ ఇ-కామర్స్ సైట్‌లో టాప్ డీల్‌లకు ప్రత్యేకమైన యాక్సెస్, 30 నిమిషాల లైట్నింగ్ డీల్స్‌కు ముందస్తు యాక్సెస్‌ను ప్రైమ్ యూజర్లు పొందుతారు.

Next Story