అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. సూపర్ ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌కు రెడీ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 8:31 AM ISTఅమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. సూపర్ ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌కు రెడీ అయ్యింది. స్మార్ట్‌ఫోన్, టీవీలపై డిస్కౌంట్ ఎదురుచూస్తున్న వినియోగదారులకు శుభవార్త చెప్పింది అమెజాన్. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించింది. మరోసారి ఆఫర్లను తెస్తుండటంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నిర్వహించనుంది. 5 రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో మరింత తగ్గుదల లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలు, అలెక్సా డివైజులపై డిస్కౌంట్లు అందివ్వనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో బ్యానర్‌ను సిద్ధం చేసింది. మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. ఆయా ప్రొడక్ట్‌ల వారీగా ఆఫర్ల వివరాలను అమెజాన్ త్వరలో రివీల్ చేయనుంది.