మొబైల్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఎందుకంటే..?

By అంజి  Published on  2 Dec 2019 3:47 AM GMT
మొబైల్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఎందుకంటే..?

ఢిల్లీ: నేటి అర్థరాత్రి నుంచి మొబైల్‌ చార్జీలు పెరగనున్నాయి. ఈ నెల 3 నుంచి పెంచిన మొబైల్ చార్జీలు అమల్లోకి వస్తాయని భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా టెలికాం సంస్థలు ఆదివారం ప్రకటించాయి. టెలికాం కంపెనీలు భారీ నష్టాలతో కుదేలవుతున్న కారణంగానే చార్జీలు పెంచినట్టుగా తెలుస్తోంది. గత నాలుగేళ్లలో తొలిసారిగా ప్రీపెయిడ్‌ వినియోగదారులకు కాల్స్‌, డేటా ఛార్జీలు పెంచతున్నట్లు ప్రకటించాయి. 50 శాతం వరకు ఛార్జీల పెంపు ఉండనుంది. ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషన్‌ 6 పైసలు వసూలు చేస్తామని టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. మరో వైపు జియో కూడా ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి పెంచిన కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని రిలయన్స్‌ జియో ప్రకటించింది. ట్రాయ్‌, టెలికాం విభాగాల మధ్య సయోధ్య కొరవడ్డాయి. మొబైల్‌ చార్జీల పెంపుపై ట్రాయ్‌ జోక్యం చేసుకునే అవకాశం లేదు. దీంతో

మొబైల్‌ టారిఫ్‌ల (ఫ్లోర్‌ ప్రైస్‌) నిర్ధారణలో ట్రాయ్‌, టెలికాం విభాగాల మధ్య ఏకాభిప్రాయం కొరవడటంతో కాల్‌ చార్జీల పెంపుపై అవి జోక్యం చేసుకునే పరిస్థితి లేకపోవడం టెలికాం కంపెనీలకు కలిసివచ్చింది. నష్టాల కారణంగా ఛార్జీల పెంపు అనివార్యమని టెలికాం సంస్థలు ఇప్పటికే సృష్టం చేశాయి. టారిఫ్‌లు పెంచాలని ఇప్పటికే నిర్ణయించిన టెలికాం కంపెనీలు.. ముందు ముందు కూడా ఛార్జీలు పెరుగుతాయని తెలిపాయి. టారిఫ్‌లపై ఇక ఎలాంటి చర్చలు ఉండవని సృష్టం చేసినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఏజీఆర్‌ విషయంలో కేంద్రప్రభుత్వంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు లైసెన్స్‌ ఫీజు చెల్లింపుల బకాయిలను జరిమానాలు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు వడ్డీలతో సహా చెల్లించాలని తీర్పును వెలువరించింది. దీంతో టెలికాం సంస్థలపై ఒక్కసారిగా 1.17 లక్షల కోట్ల భారం పడింది. వోడాఫోన్‌ ఐడియా రూ.44,150 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.35,586 కోట్లను టెలికాం శాఖకు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రూ.50,921 కోట్ల నష్టాలను వొడాఫోన్ ఐడియా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. తమ టెలికాం సంస్థలు కొనసాగాలంటే.. వినియోగదారులపై భారం వేయక తప్పడం లేదని భావిస్తున్నాయి.

వొడాఫోన్‌ ఐడియా

వొడాఫోన్‌ ఐడియా 42 శాతం ఛార్జీలను పెంచుతూ.. కొత్త ఛార్జీల పథకాలను ప్రకటించింది. సంవత్సరం ప్యాక్‌లు రెండు ప్రస్తుతం రూ.988కి లభిస్తుండగా, ఇప్పుడు అది రూ.1499 కానుంది. రూ.1,699 ప్లాన్ ధర ఇకపై రూ.2,399కి అందుబాటులో ఉండనుంది. 84 రోజుల మూడు ప్లాన్‌లు, 28 రోజుల నాలుగు ప్లాన్‌లను అలాగే రెండు కాంబో ప్లాన్‌లను అందించనుంది. రూ.199ల నెల ప్లాన్‌ను రూ.249కి పెంచుతున్నామని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది.

భారతీ ఎయిర్‌టెల్

పెంచిన ఛార్జీలు డిసెంబర్‌ 3 నుంచి అమల్లోకి వస్తాయని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రటకటించింది. ప్రీపెయిడ్‌ వినియోగదారులపై 50 శాతం ఛార్జీలను పెంచనుంది. సంవత్సర ప్యాక్‌ను రూ.998 ధరను రూ.1,499గా ప్రకటించింది. రూ.1,699 ప్లాన్ ధర ఇకపై రూ.2,399 ధరగా ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. 84 రోజులకు సంబంధించిన ప్లాన్‌ ధరను రూ.458 నుంచి రూ.598కి పెంచింది. రూ.199ల నెల ప్లాన్‌ను 25 శాతం పెంచి రూ.249 ప్లాన్‌ ధరను ప్రకటించింది.

రిలయన్స్‌ జియో

టెలికాం సంచలనం రిలయన్స్‌ జియో కూడా ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 6 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని సృష్టం చేసింది. దీంతో కాల్స్‌, డేటా ఛార్జీలు మరింత పెరగనున్నాయి. కాగా వినియోగదారులకు కొత్త ప్లాన్లలో అదనపు లాభాలుంటాయని తెలిపింది.

Next Story