ముంబై: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

By సుభాష్  Published on  6 Oct 2020 1:15 PM GMT
ముంబై: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ పైపైకి వెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగివచ్చినా.. దేశీయ మార్కెట్‌లో మాత్రం మంగళవారం బంగారం ధరలు పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో పసిడి ధరలు పరుగులు పెట్టాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.170 పెరిగి, రూ.50,795కు చేరింది. ఇక కిలో వెండిపై రూ.117 పెరిగి ప్రస్తుతం రూ.62,058కి ఎగబాకింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ. 454 పెరిగి ప్రస్తుతం రూ.51,789కి చేరింది. అలాగే కిలో వెండిపై రూ.751 పెరిగి రూ.63,127కు చేరింది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఔన్స్‌కు 1910 డాలర్లకు క్షీణించాయి. కోవిడ్‌ తీవ్రత, ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరలు పెరుగుతున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.52,850 ఉంది.

Next Story