మహిళా కండక్టర్‌కు కరోనా లక్షణాలు.. ఆస్పత్రిలో చేరిక

By Newsmeter.Network  Published on  5 March 2020 9:24 AM GMT
మహిళా కండక్టర్‌కు కరోనా లక్షణాలు.. ఆస్పత్రిలో చేరిక

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేగుతోంది. కరోనా సోకినట్లు నిర్థారణ కాకపోయినప్పటికి.. అనుమానిత కేసులు సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న మహిళా కండక్టర్ కరోనా లక్షణాల అనుమానంతో పశ్చిమగోదావరి జిల్లి చింతలపూడి ఆస్పత్రిలో చేరారు.

సత్తుపల్లి నుంచి బస్సు ఏలూరు వెలుతుండగా.. కండక్టర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానాలు వచ్చాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులు, బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యారు. చింతలపూడిలో బస్సును ఆపి.. మహిళా కండక్టర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త నమూనా ఫలితాలు వచ్చిన తరువాతే కరోనా వైరస్‌ ఉందా..? లేదా..? అనేది నిర్థారిస్తామని వైద్యులు తెలిపారు.

ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే.. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Next Story
Share it