బ‌న్నీ - త్రివిక్ర‌మ్ ప్లాన్ మామూలుగా లేదుగా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 8:27 AM GMT
బ‌న్నీ - త్రివిక్ర‌మ్ ప్లాన్ మామూలుగా లేదుగా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో'. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాలు వ‌చ్చాయి. ఈ రెండు చిత్రాలు స‌క్సెస్ సాధించడంతో తాజా సినిమా 'అల‌... వైకుంఠ‌పుర‌ములో' సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీతో హ్యాట్రిక్ సాధించ‌డం ఖాయం అనే టాక్ ఉంది. అయితే... ఈ సినిమాకి పోటీగా మ‌హేష్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు' కూడా రిలీజ్ అవుతుండ‌డంతో బ‌న్నీ - త్రివిక్ర‌మ్ క‌లిసి ప్ర‌మోష‌న్స్ డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

అందులో భాగంగానే సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా రోజులు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచి పాట‌ల‌తో సంద‌డి చేస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌టి నుంచే త‌మ వైపు తిప్పుకుంటున్నారు. సామజవరగమన... సాంగ్‌ను ఇప్పటికే విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి బ్ర‌హ్మాండ‌మైన స్పంద‌న ల‌భించింది. ఇక లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన‌ మాస్ నంబర్ రాములో రాములా... పాట‌లో బన్నీ ఎల్లో బ్లేజర్‌లో మెరిసిపోతున్నారు. పూజా బ్లాక్ డ్రెస్‌లో అందంగా ఉంది.

మ‌రో విశేషం ఏంటంటే.. ఈ పాట‌లో చాలా మంది గుర్తించ‌లేదు కానీ.. సుశాంత్ కూడా ఉన్నాడు. బ‌న్నీతో క‌లిసి డ్యాన్స్ చేసాడు. ఈ పాట‌ను ఇలా విన్నామో లేదో అలా న‌చ్చేసింది. అభిమానుల‌ను ఈ సాంగ్ టీజర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. టీజర్ వింటుంటేనే మంచి కిక్ వస్తోంది. ఇక ఈ నెల 26న పూర్తి పాట విడుద‌ల కానుంది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేయ‌నున్నారు.

Next Story
Share it