బ‌న్నీ పాట పాడాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2019 9:22 AM GMT
బ‌న్నీ పాట పాడాడా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 'అల‌.. వైకుంఠ‌పుములో'. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని రాములో రాములా.. పాట‌ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయ‌నున్నారు. మాస్ బీట్‌తో సాగే ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే... ఈ పాట‌లో బ‌న్నీ కూడా గొంతు క‌ల‌పాడు అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది తెలిసిన‌ప్ప‌టి నుంచి అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. థమ‌న్‌కి హీరోల‌తో పాటలు పాడించ‌డం అల‌వాటు. ఆ అల‌వాటు ప్ర‌కార‌మే బ‌న్నీతో కూడా పాడించేశాడు. ఇందులో బ‌న్నీ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. ప్ర‌మోష‌న్స్ లో జెట్‌ స్పీడుతో దూసుకెళుతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌నున్నారు.

Next Story
Share it