భారత్ క్రికెట్ స్పీడ్ స్టార్‌ జస్ప్రీత్ బుమ్రా, మహిళా క్రికెటర్ స్మృతీ మంధానకు ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది. విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్ ఇయర్ పురస్కారాలకు వీరిద్దరూ ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురు ఎంపికయ్యారు. దీనిలో ఇండియాకు చెందిన బుమ్రా, మంధాన ఉన్నారు.పాక్‌కు ఫఖర్ జమాన్, శ్రీలంకకు చెందిన దిముత్ కరుణ రత్నే, ఆప్ఘనిస్తాన్‌కు చెందిన కరుణ రత్నేలకు విజ్డెన్ పురస్కారాలు లభించాయి. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్‌కు కూడా అరుదైన గౌరవం దక్కింది. 2019-2020కి గానూ 7వ విజ్డెన్‌ వార్షిక పబ్లికేషన్‌లో మయాంక్‌ కథనాలు ప్రచురితమయ్యాయి.

విజ్డెన్‌ పురస్కారానికి ఎంపికైన మూడో భారత మహిళా స్మృతి మంధాన. ఇంతకు ముందు మాజీ కెప్టెన్‌ మిథాలిరాజ్‌, దీప్తి శర్మ ఈ అవార్డ్ అందుకున్నారు. అలాగే దిగ్గజ ఆటగాళ్లైన గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌లు విజ్డెన్‌ ఇండియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.