ముంబై: ‘జియో ఫోన్‌ దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌`కు అనూహ్య స్పందన రావడంతో ఆఫర్ ను పొడిగిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించారు. మూడు వారాల పాటు కొనసాగించిన ఈ ఆఫర్‌కు ఊహించనంత డిమాండ్‌ వచ్చిందని రిలయన్స్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌లో భాగంగా జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం క‌లిపి రూ.1500 లాభం చేకూరేలా వినియోగదారుడికి అందించింది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 డాటా అందిస్తున్నారు. మొద‌టి ఏడు రీచార్జ్‌ల‌కు రూ.99 విలువైన డాటాను జియో అదనంగా జ‌త‌చేయ‌నుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.