భారీగా తగ్గిన బంగారం ధర

By సుభాష్  Published on  14 March 2020 9:05 AM IST
భారీగా తగ్గిన బంగారం ధర

ఈ వార్త బంగారం ప్రియులకు తీపికబురనే చెప్పాలి. బంగారం ధర భారీగా దిగివచ్చింది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర.. ఈ రోజు కూడా భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర తగ్గడం సహా దేశీ మార్కెట్‌లోనూ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడంతో బంగారంపై ప్రతికూల వాతావరణం ఏర్పడిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది.

హైదరాబాద్‌ మార్కెట్‌లో శనివారం పసిడి ధర దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 1,330 తగ్గుదలతో రూ. 43,850 ఉండగా, అదే సమయంలో 22 క్యాకెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1,120 తగ్గింది. దీంతో రూ.40, 200లకు పడిపోయింది.

ఇక బంగారంబాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో బంగారం రూ.370 తగ్గి, ప్రస్తుతం రూ. 48,030కు చేరుకుంది. పరిశ్రమ, యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడమే ధరల తగ్గుదలకు కారణమని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.

ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో బంగారం ధర రూ.1,150 తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 తగ్గి, రూ. 42,250కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,150 తగ్గింపుతో రూ. 41,050కు క్షీణించింది. ఇక వెండి కిలోకు రూ.370తగ్గింపుతో రూ. 48,030కు చేరుకుంది.

Next Story