ఉత్తరాంధ్రకు పొంచివున్న 'బుల్‌ బుల్‌' ముప్పు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 11:53 AM GMT
ఉత్తరాంధ్రకు పొంచివున్న బుల్‌ బుల్‌ ముప్పు

విశాఖ: బంగాళాఖాతంలో 'బుల్‌ బుల్‌' తుఫాన్‌ క్రమంగా బలహీనపడుతోంది. పశ్చిమబెంగాల్‌లోని కేప్‌పుర ప్రాంతంలో ఈ రాత్రికి తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 95 కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమై ఉంది. 'బుల్‌ బుల్‌' తుఫాన్‌ ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.

తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలను చేపట్టారు. సహాయక చర్యల కోసం సిబ్బందిని, నౌకలు, హెలికాప్టర్లను అధికారులు సిద్ధం చేసి ఉంచారు.

Next Story