బడ్జెట్ రోజున గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా..? తగ్గిందా..?
Did the gas cylinder price increase on the budget day Did it decrease.ప్రతీ నెలా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సామాన్యుడి
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2023 8:07 AM ISTప్రతీ నెలా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతూనే ఉంది. ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ రోజు(ఫిబ్రవరి 1) తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సామాన్యులు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే.. బడ్జెట్ కన్నా ముందే సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించింది. అదేమిటంటే ఈ నెల వాణిజ్య, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఇది సామాన్యులకు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1769, కోల్‌కతాలో రూ.1870, ముంబైలో రూ.1721, చెన్నైలో రూ. 1917 వద్ద కొనసాగుతోంది. ఏపీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,111 ఉండగా హైదరాబాద్‌లో కూడా దాదాపు ఇదే రేటు ఉంది. జనవరిలో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోగా, కమర్షియల్ సిలిండర్ ధర మాత్రం రూ.25 పెరిగింది. గత సంవత్సరం కాలంగా చూస్తే మాత్రం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.150 పెరిగింది.
సబ్సీడి పెంపు..!
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో సామాన్యులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ భారీగా పెరగనున్నట్లు బావిస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. పెరుగుతున్న గ్యాస్ ధరల దృష్ట్యా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో బడ్జెట్‌లో కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.