బడ్జెట్ 2020 : ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం: మంత్రి నిర్మలా సీతారామన్‌

By సుభాష్  Published on  1 Feb 2020 6:08 AM GMT
బడ్జెట్ 2020 : ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం: మంత్రి నిర్మలా సీతారామన్‌

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త జీఎస్టీ విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఈ రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌కు సంబంధించి విషయాలు సభలో వెల్లడించారు. ఈ ఏడాది జీఎస్టీ రిటర్న్‌ మరింత సులభం కానున్నాయని, ఇప్పటి వరకు 40 కోట్ల మంది జీఎస్టీ రిటర్న్‌ దాఖలు చేశారని అన్నారు. ప్రపంచంలో భారత్‌ ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు. భారత్‌కు 284 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. అలాగే న్యూ ఇండియా, సబ్‌కాసాత్‌, ప్రజా సంక్షేమం ఇలా మూడు లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని వివరించారు.

డిజిటల్‌ ఇండియాకు పెద్ద పీట వేయనున్నామని అన్నారు. ఈ బడ్జెట్‌లో అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. భారత్‌ ఎప్పటికి కమలం లాగా వికసించాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తగు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 6.11 కోట్ల మందిరైతులకు బీమా సౌకర్యం కల్పించనున్నామని అన్నారు.

Next Story