భారతదేశం-బాంగ్లాదేశ్ సరిహద్దు ఢుబ్రీ సెక్టర్ వద్ద సరిహద్దు భద్రతా దళం (BSF) నిఘా పెంచింది. భూమి లో, ఆకాశంలో కూడా నిఘా ఎక్కువ చేసింది.

మేఘాలయా నుంచి వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బిహార్ వరకూ ఢూబ్రి సెక్టార్ సరిహద్దు విస్తరించి ఉంది. ఇక్కడ వాడటానికి బీఎస్ఎఫ్ డ్రోన్ కెమెరాలు కొనగోలు చేసింది. రూ.37 లక్షల విలువ చేసే ఒక్కో కామెరా డే అండ్ నైట్ విజన్ ఉన్న కెమేరాలు సుమారుగా 2 కి.మిల వరకూ చిత్రాలను తీయగలదు.

బాంగ్లాదేశ్ తో అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు 4 వేల కిమిల మేర సరిహద్దు ను పంచుకుంటున్నాయి. ఈ 61 కిమిల సరిహద్దులో బ్రహ్మపుత్రా నది విస్తారంగా ప్రవహిస్తుంది. మధ్యలో ఉండే ఇసుక దిబ్బలూ, నీటి చానెల్స్ పైన వానా కాలంలో నిఘా ఉంచడం కష్టతరమైన పని.

రాత్రి వేళల్లో పర్యవేక్షించడానికి వీలు లేని ప్రాంతాలలో స్మగ్లింగ్ జరుగుతుంది. టిథర్ డ్రోన్ కామెరాల వల్ల ఈ ఇబ్బందులు తొలగుతున్నాయి. ఇవి 150 మీటర్ల ఎత్తులో నుంచి కూడా చిత్రాలు తీసి పంపగలవు. అని అధికారులు తెలిపారు. మాములు డ్రోన్ల కంటే టిథర్ డ్రోన్లు శక్తివంతమైనవి.

ఇవే కాకుండా, భూమి లోపల, నీటిలో పనిచేసే పరికరాలను కూడా బి ఎస్ ఎఫ్ ఈ ప్రదేశంలో వాడుతోంది. వేడి ని బట్టి మనుషులు, జంతువులు, ఇతర పదార్ధాల కదలికలు అంచనా వేస్తాయి ఈ పరికరాలు.

ఇక్కడ జంతువుల అక్రమ రవాణా చేసేవారు, పిల్లలను వాడుతారని, బొప్పాయి కాడలను వాడి నీటిలో ఈదుతూ వారు జంతువులను సరిహద్దు దాటిస్తారని, దీనిని అరికట్టడానికి ఈ పరికరాలు సహకరిస్తాయి అంటున్నారు అధికారులు.

సత్య ప్రియ బి.ఎన్