తాళి కట్టే సమయంలో వరుడికి షాకిచ్చిన వధువు

By సుభాష్  Published on  1 Nov 2020 7:19 AM GMT
తాళి కట్టే సమయంలో వరుడికి షాకిచ్చిన వధువు

తాళి కట్టే సమయంలో ఓ వధువు వరుడికి షాకిచ్చింది. పెళ్లి మండపంలో ఇద్దరు ఒకటవుతున్న సమయంలో వధువు ఇచ్చిన షాక్‌తో కుటుంబ సభ్యులు, బంధువులు నివ్వెరపోయారు. తమిళనాడులోని నీల్‌గిరీస్‌లోని మట్టకండి గ్రామంలో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నీలగిరి జిల్లా కోతగిరికి చెందిన ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. కరోనా నిబంధనలతో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఇరు కుటుంబాలు అక్టోబర్‌ 29న పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే వివాహం జరిగే సమయంలో సడన్‌గా వధువు షాకిచ్చింది. నా ప్రియుడు నా కోసం వస్తున్నాడు.. నువ్వు తాళి కట్టవద్దు.. ఈ పెళ్లి వద్దంటూ చెప్పేపింది. ఈ మాట విన్న వరుడుతో పాటు కుటుంబ సభ్యులు విస్మయానికి గురయ్యారు. ప్రియుడు వస్తున్నాడంటూ పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది.

ఆమె కుటుంబీకులు ఎంత చెప్పినా ఎదురు సమాధానం ఇస్తూ పీటల మీద నుంచి వెళ్లిపోయింది. అయితే వధులు పీటల మీద నుంచి లేచిపోవడంతో బంధువులు జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, ససేమిరా అంది. ఓ పెద్దావిడ మరి కొందరు జోక్యం చేసుకుని బెదిరించి వివాహం జరిపించాలని అనుకున్నా.. వధువు వారిపైనే ఎదురు తిరిగింది. పెళ్లి ఆగిపోయిన తర్వాత ఎంత సేపటికి ప్రియుడు రాకపోవడంతో వధువుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.

Next Story
Share it