సానియా ఇంట్లో పెళ్లి సందడి

By Newsmeter.Network  Published on  10 Oct 2019 6:20 AM GMT
సానియా ఇంట్లో పెళ్లి సందడి

హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుటుంబాలు బంధుత్వం కలుపుకోనున్నాయి. సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జాను, అజారుద్దీన్ కుమారుడు అసద్ నిఖా చేసుకోనున్నారు.

 A28b3ec4 E8d7 11e9 8d06 17233a3ef1acవీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు చర్చించుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

21 Asad Ptijpg డిసెంబర్ లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరగనుంది. ఆనం మీర్జా ఫ్యాషన్ స్టైలిస్ట్ గా 'ద లేబుల్ బజార్‌'అనే అవుట్లెట్ నిర్వహిస్తున్నారు. ఆనం కు గతంలో హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ తో వివాహం జరిగింది. అయితే.. వీరిద్దరి మధ్య అపార్ధాలు తలెత్తడంతో డైవర్స్ అయ్యాయి. అజారుద్దీన్ మొదటి భార్య కుమారుడు అసద్ క్రికెటర్‌గా తన ప్రతిభ చూపిస్తున్నాడు. 2018 డిసెంబర్ లో గోవా లో జరిగిన రంజితో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. ఈ వివాహంతో రెండు కుటుంబాల మధ్య స్నేహం కాస్తా బంధుత్వం గా మారనుంది.

Downloadfile

Next Story
Share it