ముఖ్యాంశాలు

 • ఇకపై ఎయిర్ పోర్ట్ సిబ్బంది అందరికీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్
 • స్పష్టమైన విధివిధానాలను రూపొందించిన డి.జి.సి.ఎ
 • బిఎ టెస్ట్ కు నిరాకరిస్తే విధినిర్వహణకు అనుమతి నిరాకరణ
 • బిఎ టెస్ట్ లో పట్టుబడితే క్రమశిక్షణ చర్య తప్పనిసరి
 • సంబంధిత ఎయిర్ లైన్స్ కు చర్య తీసుకునే అధికారం
 • ప్రయాణికులకు అసౌకర్యాన్ని నివారించేందుకు చర్యలు
 • పట్టుబడిన ఉద్యోగుల సంఖ్యలో హైదరాబాద్లది ప్రథమ స్థానం
 • తర్వాతి స్థానంలో ఉన్న బెంగళూరు విమానాశ్రయం
 • దేశంలో మొత్తం దాదాపు 10 విమానాశ్రయాల్లో బిఎ టెస్టులు
 • భారీ స్థాయిలో పట్టుబడిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది
 • రెండోసారి పట్టుబడితే లైసెన్స్ పై సూపర్ విజన్
 • మూడోసారి పట్టుబడితే ఉద్యోగం నుంచి తొలగింపు

హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్నప్పుడు కేవలం పైలట్లు, క్యాబిన్ క్రూ మాత్రమే కాక మొత్తంగా ఎయిర్ పోర్ట్ ఉద్యోగులందరూ మద్యపానానికి దూరంగా ఉండాలని డిజిసిఎ డైరెక్షన్ ఇచ్చింది. దీని ప్రకారం ఇకపై దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ పూర్తిగా సిబ్బంది అందరికీ బ్రీతలైజర్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. సర్వసాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ కోసం ట్రాఫిక్ పోలీసులు బిఎ టెస్ట్ చేస్తారు.

ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మూడు నెలల క్రితమే దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమాణాలను ఏర్పరచింది. ఆ గైడ్ లైన్స్ ను అన్ని విమానాశ్రయాలకూ పంపించింది. సాధారణంగా ఇప్పటివరకూ పైలట్లకు, క్యాబిన్ క్రూకి మాత్రమే ఈ బిఎ టెస్ట్ చేస్తూ వచ్చారు. ఇకపై దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవల్ని అందించేందుకు డిజిసిఎ ఈ నిర్ణయం తీసుకుంది.

సివిల్ ఏవియేషన్ చట్టం (సి.ఎ.ఆర్)లోని సెక్షన్ -5 మరియు సిరీస్ – 5 (పార్ట్ IV) ప్రకారం విమానాశ్రయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ బిఎ టెస్ట్ చేయాలని నిర్దేశిస్తోంది. దీని ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ మెయిన్ టెనెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వీసులు, ఎయిరో డ్రోమ్ ఆపరేషన్స్, ఫ్లైట్ డిస్పాచెస్, ఫైర్ మరియు రెస్క్యూ పర్సనల్, వెహికల్ డ్రైవర్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసులు అందజేసే సిబ్బంది అందరికీ ఆల్కహాల్ తీసుకున్నారో లేదో తప్పనిసరిగా టెస్ట్ చేయబోతున్నారు.

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో

ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ ఉద్యోగి బిఎ టెస్ట్ లో ఫెయిలైనట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 7వ తేదీన నిర్వహించిన బిఎ టెస్ట్ లో ఓ ప్రముఖ ఎయిర్ లైన్స్ కి చెందిన డ్రైవర్ కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈ టెస్ట్ లో ఫెయిలయ్యాడు. బ్రీతలైజర్ టెస్ట్ లో బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఐదుగురు ఉద్యోగులు అత్యధిక స్థాయిలో పట్టుబడిపోయారు. తర్వాతి స్థానంలో చెన్నై ఎయిర్ పోర్ట్ ఉంది.

కొచ్చిన్, ముంబై, విమానాశ్రయాల్లో నలుగురు చొప్పున బిఎ టెస్ట్ లో ఉద్యోగులు పట్టుబడ్డారు. వీరిలో డ్రైవర్లు, కస్టమర్ సర్వీస్ సిబ్బంది, ఒక సీనియర్ ర్యాంప్ అధికారి, ఒక కార్గో లోడర్, ఏరో బ్రిడ్జ్ స్టాఫ్, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ లతోపాటుగా కొందరు టెక్నీషియన్లు కూడా ఉన్నారు.

సి.ఎ.ఆర్ నియమాల ప్రకారం బిఎ టెస్ట్ లో పట్టుబడిన ఉద్యోగిపై సంబంధిత ఎయిర్ లైన్స్ తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా బిఎ టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరిస్తే అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు సదరు ఉద్యోగిని విధులు నిర్వహించడానికి అనుమతించడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ఉద్యోగి రెండోసారికూడా మద్యం సేవించి టెస్ట్ లో పట్టుబడితే వారి లైసెన్స్ ని అబ్జర్వేషన్ లో ఉంచుతారు.

డిజిసిఎ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. కేవలం పైలట్లు, క్యాబిన్ క్రూ మాత్రమే కాక ఇతర సిబ్బందికూడా మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నప్పుడు దాని ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తుందని, ఏ చిన్న ఉద్యోగి తప్పు చేసినా దాని ఫలితంగా వందలాదిమంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.