మనసున్న మంచి దొంగ..!
By సత్య ప్రియ Published on 19 Oct 2019 12:48 PM ISTబ్రెజిల్‌లోని ఫార్మసీ దుకాణంలో జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బ్రెజిల్ దేశంలోని అమరాంటేలో ఉన్న ఓ ఫార్మసీ షాపులోకి హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. లోపల ఉన్న కస్టమర్లను తమ వద్ద గన్‌తో బెదిరించారు. షాపు యజమానితోపాటు అందరి వద్ద ఉన్న డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.
కస్టమర్లంతా తమ వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువు తీసి వారికి ఇచ్చేశారు. వారు మొత్తం 240 డాలర్లూ, ఇతర వస్తువులూ దోచుకెళ్లారు. ఈ క్రమంలో షాపులో ఉన్న ఓ వృద్ధురాలు కూడా తన వద్ద ఉన్న డబ్బును ఓ దొంగకు ఇవ్వబోయింది. కానీ ఆ దొంగ ఆ వృద్ధురాలి నుదుటిపై ముద్దుపెడుతూ మీరివ్వక్కర్లేదు మేడం, మీ డబ్బు మీ వద్దే ఉంచుకోండని చెప్పి మిగిలిన వారి డబ్బుతో పరరయ్యారు.
ఈ మొత్తం దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.