'నమస్తే నేస్తమా' లో హాస్యంతో పాటు ఎమోషనల్‌ ఉండే క్యారెక్టర్ చేశా - బ్రహ్మానందం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 5:03 AM GMT
నమస్తే నేస్తమా లో హాస్యంతో పాటు ఎమోషనల్‌ ఉండే క్యారెక్టర్ చేశా - బ్రహ్మానందం

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వేగంగా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన 'తేరి మెహర్భానియా' చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నమూవీ ఇది. దీని ద్వారా ఆయన తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. అయితే త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ...

" కె.సి బొకాడియా నిర్మించి తొలి సారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా నమస్తే నేస్తమా. ఈ సినిమాలో నేను హాస్యమే కాకుండా.. కొంచెం ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ చేశాను అన్నారు. నాకు ఆ క్యారెక్టర్‌ చాలా సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. బొకాడియా నిర్మాతగా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయనతో సినిమా చేస్తున్నపుడు ఏ రకమైన టెన్షన్ లేకుండా ఎంతో హ్యాపీగా వర్క్‌ చేశానని తెలిపారు. అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ బాగుంటుందని పర్టిక్యులర్‌గా మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానన్నారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్"అని చెప్పారు.

Next Story
Share it