హీరోయిన్లపై తీరుపై బ్రహ్మజీ ఆగ్రహం
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్రం 21 రోజులు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హీరోలు అందరూ విరాళాలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిత్ర పరిశ్రమలోని హీరోయిన్ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు నటుడు బ్రహ్మాజీ. తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘సీసీసీ మనకోసం’ చారిటీ సంస్థకు కథానాయికల నుండి మద్దతు లభించకపోవడం పట్ల ఓ ఆయన స్పందించారు. ముంబైకి చెందిన చాలా మంది హీరోయిన్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. అందరూ స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. భారీ మొత్తంలో పారితోషికంగా తీసుకుంటున్నారని, కానీ ఇక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వారెవరూ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీ గురించి స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారన్నారు.
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి, అక్కినేని నాగార్జున రూ.కోటి, ప్రభాస్ రూ.50లక్షలు, నాని రూ.30లక్షలు, ఎన్టీఆర్ రూ.25లక్షలు, వరుణ్‌తేజ్ రూ.20లక్షలు, రవితేజ రూ.20లక్షలు, లావణ్య త్రిపాఠి రూ.లక్ష.. ఇలా తమ వంతు సాయం చేశారు. బ్రహ్మజీ రూ.75వేలు విరాళంగా ఇచ్చారు.
బ్రహ్మజీ మాటల్లోనూ నిజం లేకపోలేదు. మరి ఇప్పటికైనా ఈ విషయం పై కథానాయికలు ఎలా స్పందిస్తారో చూడాలి.