వికారాబాద్ : నిర్ల‌క్ష్యానికి నిండు ప్రాణం బ‌లైంది. పట్టణంలోని గంగారం కాలనీకి చెందిన మహేష్ (15) అనే బాలుడికి తెల్లవారుజామున పాము కాటు వేసింది. దీంతో బాలుడి త‌ల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. అందుబాటులో ఉన్న డాక్టర్లు తగిన సమయానికి చికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో బాలుడు మృతి చెందాడు.

అయితే.. హాస్పిటల్ చేరుకున్న సమయానికి చికిత్స చేసి ఉంటే బాలుడు బ్రతికి ఉండేవాడని బాలుడి బందువులు ఆందోళ‌న చేస్తున్నారు. డాక్టర్లు ఆరు గంటలు కాలయాపన చేసి.. బాలుడు చనిపోయిన త‌ర్వాత‌ వేరే ఆసుపత్రికి తీసుకెళ్ల‌మ‌న్నార‌ని బాలుడి బందువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హాస్పిట‌ల్ ఎదుట బాలుడి శవంతో బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.