అమరావతి : శాసనమండలి రద్దు అవసరమా లేదా అన్నది సీఎం జగనే ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనసభ చట్టాలను, మండలిలో నిబంధనలను టీడీపీ అతిక్రమిస్తు అడ్డుకుంటోందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపుతో రాష్ట్రంలో మండలిపై చర్చ జరుగుతోందని మంత్రి బొత్స అన్నారు. టీడీపీ రాజకీయ లబ్దికోసం శాసనమండలిని అవహేళన చేసిందన్నారు.

కొన్ని పత్రికలు పనికట్టుకొని తమపై దుష్ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్‌ మండలి రద్దు సమయంలో రామోజీరావు మద్దుతు పలికారన్నారు. అయితే ఇవాళ రామోజీరావు మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారని బొత్స వ్యాఖ్యనించారు. రాష్ట్ర శాసన మండలిపై రామోజీరావు తన స్పష్టమైన వైఖరి ఎంటో తెలపాలన్నారు. రూల్స్‌ను అతిక్రమిస్తూ వికేంద్రీకరణ బిల్లను సెలెక్ట్‌ కమిటీకి పంపారన్నారు. తాము ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నామని ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స్‌ ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబులా తమకు ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం లేదని, టీడీపీ ఎమ్మెల్సీలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము ఎవరిని బెదిరించామో యనమల చెప్పాలని అన్నారు. ప్రజల మద్దతుతో గెలవలేని లోకేష్‌కి మండలి అవసరం అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యనించారు. రేపు మండలి రద్దుపై ప్రభుత్వ నిర్ణయం తెలుస్తుందన్నారు. యనమల వ్యాఖ్యలనే మండలి చైర్మన్‌ నిర్ణయం చెబుతున్నారని పేర్కొన్నారు. మండలి రద్దు వల్ల తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. చంద్రబాబు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స ఆరోపించారు. మండలి రద్దుకు ఎంత సమయం పడుతుందనేది రేపు తెలుస్తుందన్నారు.

Newsmeter.Network

Next Story