వైసీపీ, టీడీపీ రెండూ మాకు ప్రత్యర్ధులే..!: ఎంపీ సుజనా చౌదరి

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందన్నారు ఎంపీ సుజనా చౌదరి. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కారణం ఏదైనా సీఎస్‌ను బదిలీ చేసిన విధానం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. ఏపీలో రాచరిక జమానా నాటి పాలన సాగుతోందని ఆయన చెప్పుకోచ్చారు. రాష్ట్రంలో సామాజిక వర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా ఇసుక కొరతపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు. రూ.300 కోట్ల వరకు మాత్రమే ఇసుక ద్వారా ఆదాయం వస్తుంది తప్ప అంతకు మించి వచ్చే అవకాశమే లేదన్నారు. దీనిపై పవన్‌కళ్యాన్‌ లాంటి నేతలు ప్రశ్నిస్తే..వారిపై కూడా ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప..సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియామీద ఆంక్షలు తీసుకురాడానికి ముందు ఎందుకు ఆంక్షలు విధించారన్న దానిపై వివరణ ఇవ్వలేదన్నారు. గతంలో ప్రభుత్వంలో చంద్రబాబు లెక్కకుమించి శంకుస్థాపనలు చేసి ప్రాజెక్టులు నిర్మాణంలోనే కాలయాపన చేశారని ఆరోపించారు. వైసీపీ, టీడీపీ రెండు మాకు ప్రత్యర్థలే అంటూ సుజనా చౌదరి విమర్శల వర్షం గుప్పించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.