మంత్రి బోత్స సత్యనారాయణ ఇంట విషాదం
By సుభాష్Published on : 16 Aug 2020 7:58 AM IST

ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఇంటి విషాదం నెలకొంది. ఆయన తల్లి ఈశ్వరమ్మ (85) ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మంత్రి బోత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు కాగా, రెండో కుమారుడు బోత్స అప్పల నరసయ్య (ఎమ్మెల్యే). విజయనగరంలోని స్వర్గధామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read
హైదరాబాద్లో 1,050 కిలోల గంజాయి పట్టివేతNext Story