ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

By రాణి  Published on  5 April 2020 3:17 PM IST
ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

మన శరీరం తరచుగా అనారోగ్యం బారిన పడుతుందంటే..అందుకు ప్రధాన కారణం మనలో రోగ నిరోధక శక్తి తగినంత లేకపోవడమే. ప్రకృతి నుంచి సహజంగా లభించే పళ్లు, కూరగాయలతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మరి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి ? మన ఆహారపు అలవాట్లలో రావాల్సిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Watermelonపుచ్చకాయ

చూడగానే ఎర్రటి గుజ్జుతో నోరూరించే పుచ్చకాయలో గ్లుటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా ఉంటాం.

Cabbageక్యాబేజీ

ఇందులో ఉండే గ్లుటమైన్ కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రక్తవృద్ధికి తోడ్పడుతుంది. కూరగా వండుకుని తినేకన్నా వెజ్ సలాడ్ లో క్యాబేజీని కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలుంటాయి.

Garlicవెల్లుల్లి

వెల్లుల్లిలో పుష్కలంగా ఉండే అనేకరకమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లు, క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలను వెల్లుల్లి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

Sweetpotatoచిలకడదుంప

చిలకడదుంపలో బీటా కెరొటిన్లు బాగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కణాల నుంచి ఎదురయ్యే అనర్థాలను తొలగిస్తాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించే విటమిన్ ఎ కూడా చిలకడదుంపలో ఉంది.

Curdపెరుగు

పెరుగులో ఉండే విటమిన్ డి జలుబు, ఫ్లూ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే తరచూ జలుబు బారిన పడకుండా చేస్తుంది. జబ్బులతో పోరాడే రోగ నిరోధక శక్తి పెరుగులో లభిస్తుంది.

Palakuraపాలకూర

పాలకూరలో ఉండే ఫొలేట్ శరీరంలో కొత్త కణాల ఉత్పత్తి, డీఎన్ఏ మరమ్మతులు చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఇందులో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పాలకూరలో లభిస్తాయి.

Almondsబాదంపప్పు

బాదంలో ఉండే విటమిన్ ఇ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. అలాగే వీటిలో ఉండే రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి బి విటమిన్లు ఒత్తిడి, ఆందోళన వంటి ప్రభావాల నుంచి దూరం చేస్తాయి.

Citus Fruitsసిట్రస్ జాతి పళ్లు

నిమ్మ, బ్రోకలి, క్యారెట్, పుట్టగొడుగులు, ఓట్స్, ఉల్లిపాయలు, పసుపు వంటి ఆహార పదార్థాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

Next Story