రజనీకాంత్ ఇంట్లో బాంబు.. ఏ క్షణంలోనైనా పేలవచ్చు

By సుభాష్  Published on  18 Jun 2020 10:23 AM GMT
రజనీకాంత్ ఇంట్లో బాంబు.. ఏ క్షణంలోనైనా పేలవచ్చు

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. పోయిన్‌ గార్డెన్ లోని రజనీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టామని, అది ఏ క్షణంలోనైనా పేలే అవకాశాలున్నాయని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కాల్‌ రాడంతో పోలీసులు హుటాహుటిన రజీని ఇంటికి చేరుకున్నారు. బాంబు స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో ఇంట్లో మొత్తం పరిశీలించారు. చివరికి ఎక్కడా బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్‌ ఫేక్‌ కాల్‌గా గుర్తించారు పోలీసులు. అయితే ఆ బెదిరింపు కాల్‌ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరో ఆకతాయి పని అని నిర్ధారించారు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా చెన్నై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

బెదిరింపు కాల్‌ రావడం కొత్తేమి కాదు..

కాగా, రజనీకాంత్‌ ఇంటికి బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌ రావడం ఇది కొత్తేమి కాదు. ఇలా చాలా సార్లు ఫోన్లు వచ్చాయి. అప్పట్లో పోలీసులు ఇంట్లో పరిశీలించగా, ఎలాంటి బాంబు లేదని తేలింది. తమిళనాడులో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి బెదిరింపు కాల్స్‌ రావడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.

Next Story
Share it