'శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన దీపికా పదుకొనె

By అంజి  Published on  3 Dec 2019 2:57 AM GMT
శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన దీపికా పదుకొనె

దివంగ‌త అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చ‌రిత్ర‌ ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే పుస్తక రూపంలో రానుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

C649b46e A115 42c5 84bf 6e330f1c6105

ఈ పుస‌క్తానికి ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట‌ రాయ‌డం విశేషం. ‘ఐకాన్ శ్రీదేవిగారి న‌టనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాల‌ను చూస్తూ పెరిగాను. న‌ట‌న‌లో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్‌.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాజోల్.

శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వ‌ర‌కు ఆమె ఎదుర్కొన్న ప‌రిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను రచయిత స‌త్యార్థ్ నాయ‌క్ సవివరంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ బుక్ కోసం శ్రీదేవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

7d4ed7e8 B3a2 420c 904f 0b5e3a33873d

Next Story