వైద్యుల పర్యవేక్షణలో అక్షయ్‌ కుమార్‌ సినిమా షూటింగ్‌..!

By సుభాష్  Published on  28 July 2020 8:51 AM IST
వైద్యుల పర్యవేక్షణలో అక్షయ్‌ కుమార్‌ సినిమా షూటింగ్‌..!

కరోనా వితప్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బదులకు గురైన వారిని అదుకోవడం, అలాగే భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిన బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ను రియల్‌ హీరో అంటూ దేశమంత ప్రసంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇది తన బాధ్యత అంటూ ఒక్కమాటలో చెప్పేసిన అక్షయ్‌ కుమార్‌.. తాజాగా సినిమా షూటింగ్‌లకు సిద్ధమవుతున్నారు. కరోనాతో దాదాపు నాలుగు నెలల పాటు నిలిచిపోయిన షూటింగ్‌లు, అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో షూటింగ్‌ లు పునః ప్రారంభమయ్యాయి.

అయితే తాజాగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటిస్తోన్న 'బెల్‌బాటమ్‌' మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్‌ సిద్దమవుతోంది. ఈ షూటింగ్‌ ఆగస్టులో లండన్‌లో చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా ఉన్న నేపథ్యంలో ఇందు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్షయ్‌ కుమార్‌.

సెట్‌లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్యుల బృందాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మాస్క్‌ లు, శానిటైజర్లు, ఫేస్‌ ఫీల్డులు, థర్మల్‌ స్క్రీనింగ్‌ సహా పలు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు. చాలా రోజుత ర్వాత మళ్లీ సెట్‌లో అడుగుపెట్టబోతుండటం ఆనందంగా ఉందని చెబుతున్నారు అక్షయ్‌ కుమార్.

Next Story