సింగర్‌ సునీతకు కొత్త సమస్య

By సుభాష్  Published on  28 July 2020 2:01 AM GMT
సింగర్‌ సునీతకు కొత్త సమస్య

ప్రముఖ సింగర్‌ సునీతకు కొత్త సమస్య వచ్చి పడింది. ఓ వ్యక్తి తన పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు మేనల్లుడిని అంటూ ప్రచారం చేసుకుంటూ కొందరి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయంపై సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు.

ఇంతటి మోసానికి పాల్పడుతున్న చైతన్య అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు.. ఇప్పటి వరకు చైతన్య అనే వ్యక్తిని ఇంత వరకు కలవలేదని సునీత స్పష్టం చేశారు. నా పేరు ఉపయోగించుకుని అమోయకులను మోసం చేస్తున్నట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు చైతన్య అనే వ్యక్తి అల్లుడు ఎవరు లేరంటూ ఫేస్‌ బుక్‌ ద్వారా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు.

సెలబ్రేటీల పేరు చెప్పగానే డబ్బులు ఎలా ఇస్తారు.. ప్రతి రోజు సోషల్‌ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలను ఎలా నమ్ముతారని సునీత ప్రశ్నించారు. ఇక చైతన్య తన అల్లుడు కాదని అని సునీతనే స్వయంగా చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Next Story
Share it