ప్రముఖ బాలీవుడ్‌ నటి నిమ్మి ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆమె గత ఆరునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని సర్లా నర్సింగ్‌ హోమ్‌లో చికిత్స పొందుతున్న నిమ్మి (88) తుదిశ్వాస విడిచారు. ఆమె అసలు పేరు నవాబ్‌ బానో. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ఫహేదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి అబ్దుల్‌ హకీమ్‌ మిలటరీ కాంట్రాక్టరు, తల్లి వహీదాబాయి మంచి గాయని, సినీ నటి.

రాజ్‌కపూర్‌ తెరకెక్కించిన ‘బర్సాత్‌’ సినిమాతో నటిగా తెరపైకి వచ్చారు. ఈ చిత్రంలో గ్రామీణ యువతిగా ఆమె నటనకు ప్రక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆమె ఎక్కువగా ఇలాంటి గ్రామీణ యువతి పాత్రల్లోనే ప్రేక్షకులకు చేరువైంది. నటిగా నిమ్మికి ‘ఆన్‌, ఉడాన్‌ ఖటోలా, భాయ్‌ భాయ్‌, కుదన్‌, మేరే మహబూబ్‌’ తదితర సినిమాలు ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చాయి.

1949లో ప్రారంభమైన ఆమె 1965 వరకు తన నటన కొనసాగించింది. ‘లవ్‌ అండ్‌గాడ్‌’ సినిమా చేసింది. ఆ మూవీ మాత్రం 23 ఏళ్ల తర్వాత అంటే 1986లో విడుదలైంది. ఆమె మృతికి రిషీకపూర్‌, మహేష్‌ భట్‌ సహా పలువురు బాలీవుడ్‌ నటీనటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.