ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ రష్యన్ వ్యభిచారిని..!?

By రాణి  Published on  24 Dec 2019 7:19 AM GMT
ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ రష్యన్ వ్యభిచారిని..!?

ముఖ్యాంశాలు

  • బాలీవుడ్ నటిని లైంగికంగా వేధించిన నిర్మాత

ముంబై : తాను చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఎదుర్కొన్న సమస్యల గురించి బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఓ ఇంగ్లీష్ మీడియాతో పంచుకున్నారు. 2013లో రణ్ బీర్ కపూర్, దీపికా పదుకొణెతో కలిసి ''యే జవానీ హై దివానీ'' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించినప్పటికీ తనకు అవకాశాలు రాలేదని అసంతృప్తి చెందింది కొచ్లిన్. ఆ సినిమా విడుదల తర్వాత దాదాపు 9 నెలల పాటు అవకాశాలు లేక ఖాళీగా ఉందట. హిట్ వచ్చినా ఒక్క ఆఫర్ కూడా రాకపోవడంతో చాలా బాధ కలిగిందని కొచ్లిన్ చెప్పుకొచ్చారు.

అయితే చాలా కాలానికి ఓ నిర్మాత తన సినిమాలో నటించేందుకు ఆఫర్ ఇచ్చాడు. కానీ పరోక్షంగా లైంగిక వేధింపులకు గురిచేశాడు. తనతో డేట్ కి రావాలని అడిగితే అందుకు ఒప్పుకోకపోవడంతో ఇచ్చిన ఆఫర్ ను వెనక్కి తీసేసుకున్నాడు. గతంలో మీ టూ వేదిక ద్వారా కూడా నేను ఈ విషయంపై మాట్లాడాను. దీని గురించి నా థెరపిస్ట్ కు, ఆ తర్వాత నా బాయ్ ఫ్రెండ్ కు చెప్పాను. కేవలం బాలీవుడ్ లోనే కాదు. హాలీవుడ్ లో కూడా ఆడవాళ్లకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. నేను హాలీవుడ్ కు వెళ్లినపుడు అక్కడి క్యాస్టింగ్ ఏజెంట్ నా ముఖానికి దగ్గరగా వచ్చి కళ్లకిందున్న వలయాలను చూశాడు. దేవ్ డి సినిమాలో నటిస్తుండగా కొందరు నన్ను చూసి..ఈ రష్యన్ వ్యభిచారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించారు. అలా అడిగిన వాళ్లందరికీ నేను రష్యన్ ను కాదు అని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి'' అని కొచ్లిన్ తన బాధను పంచుకుంది. దేవ్ డి సినిమాలో కల్కికొచ్లిన్ వ్యభిచారిగా నటించారు.

Next Story
Share it