అరవింద స్వామికి 'కంగనా రనౌత్' సెట్ అవ్వట్లేదు !

By Newsmeter.Network  Published on  23 Dec 2019 3:25 AM GMT
అరవింద స్వామికి కంగనా రనౌత్ సెట్ అవ్వట్లేదు !

తమిళ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా, సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో దర్శకుడు ఏ ఎల్ విజయ్ 'తలైవి' అనే పేరుతో అమ్మ బయోపిక్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ పాత్ర‌లో అరవింద స్వామి న‌టిస్తున్నారు. అయితే కంగనా లాంటి హాట్ బ్యూటీ పక్కన అరవింద స్వామి లాంటి సాఫ్ట్ యాక్టర్ సెట్ అవ్వట్లేదట. అరవింద స్వామి కంగనా సరసన అసలు బాగాలేదని తమిళ ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరి జంట ఎలా ఉంటుందో.. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ ను చిత్రయూనిట్ రఫ్ ఎడిటింగ్ చేసి చూసుకుందట. అవుట్ ఫుట్ కాస్త సంతృప్తికరంగా లేదని.. అరవింద్ స్వామి గెటప్ మార్చి మళ్ళీ రీషూట్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

కాగా జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ చిత్రాలో చూపించనున్నారు. దాంతో కంగనా రనౌత్ 16 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 62 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఇక కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ సినిమా 'డార్కెస్ట్ హవర్'కి మేకప్ మెన్ గా పనిచేసిన 'గ్యారీ ఓల్డ్ మెన్, 'అమ్మ' బయోపిక్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం తమిళం కూడా నేర్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ క్వీన్.. బరువు కూడా పెరుగింది. ఈ చిత్రం కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగిందట.

ఏమైనా జయలలిత లాంటి బలమైన నాయకురాలని ప్రతిబింబించాలంటే కంగనా లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. మరి ఎప్పుడూ వివాదాస్పద మాటలతో ఘాటైన వ్యాఖ్యలు చేసే కంగనా ‌ జయలలిత పాత్రలో ఎలా మెప్పిస్తోందో చూడాలి.

Next Story