బయటపడ్డ బోటు ఆనవాళ్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 9:40 PM IST
బయటపడ్డ బోటు ఆనవాళ్లు..!

తూర్పు గోదావరి జిల్లా: కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటు బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి. మొత్తానికి ధర్మాని సత్యం బృందం బోటు ఆనవాళ్లు కనుగొంది. సత్యం బృందం వేసిన యాంకర్‌కు బోటుకు సంబంధించిన రెయిలింగ్ తగిలింది. దేవుడిగొంది నుంచి రెండు వందల మీటర్ల దూరంలో బోటు ఉందని గుర్తించినట్లు సత్యం బృందం తెలిపింది. మూడు రోజు బోటు వెలికితీత పనులు ఆపేశారు. అధికారులు స్పాట్‌కు చేరుకుని సత్యం బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోటులో 13 మృతదేహాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Next Story