అమరావతి: పాపికొండల బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి మీడియాకు చెప్పారు.

ఈ రోజు ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖపట్నంకు చెందిన అరుణగా గుర్తించామన్నారు మంత్రి . ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 9 మంది.. తెలంగాణకు చెందిన ఏడుగురు మృతదేహాల ఆచూకీ తెలియాలన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story