గోదావరి బోటు ప్రమాదం- చిట్టచివరి మృతదేహం దొరికే వరకు గాలింపు- ఐటీడీఏ అధికారి ఎన్. కుమార్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 2:05 PM GMT
గోదావరి బోటు ప్రమాదం- చిట్టచివరి మృతదేహం దొరికే వరకు గాలింపు- ఐటీడీఏ అధికారి ఎన్. కుమార్

రంపచోడంరం, తూ.గో. జిల్లా: బోటు ప్రమాదంలో చనిపోయిన వారి బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు ఐటీడీఏ పీఓ నిషాంత్ కుమార్‌. చివరి మృతదేహం దొరికే వరకు గాలింపు చేపడతామన్నారు. ఈ నెల15న కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుందన్నారు నిషాంత్ కుమార్‌. బోటు 100 మీటర్ల లోతులో మునిగి ఉందన్నారు. ఉత్తరాఖండ్ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సోనార్ సిస్టమ్ ద్వారా 50 మీటర్ల వరకు కెప్చర్‌ చేశారని..మిగతా ప్రాంతాన్ని చేయలేకపోయారన్నారు. ఇప్పటి వరకు 37 మృతదేహాల ఆచూకి లభించిందని..మరో 14మృతదేహాల ఆచూకి లభించాల్సి ఉందన్నారు ఐటీడీఏ అధికారి నిషాంత్ కుమార్‌. ప్రమాద స్థలం దగ్గర క్రౌడ్ ఏర్పడితే ..గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. అందువలనే 144 సెక్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు

Next Story
Share it