దేవీ పట్నం, తూ.గో జిల్లా: గోదావరిలో బోటు మునిగి తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అయితే..ఆ బోటును ఎంతలోతులో మునిగిందో తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు ఉత్తరాఖండ్ టీమ్‌ ఆ బోటు మునిగి ఎక్కడ ఉందో..ఎన్ని అడుగుల లొతులో ఉందో గుర్తించింది. 70 -80 అడుగుల లోతులో బోటు మునిగి ఉన్నట్లు ఉత్తరాఖండ్ టీమ్‌ చెబుతోంది. సోనార్ సిస్టమ్ ద్వారా బోటు జాడను తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ రోజు 6 మృతదేహాలను బయటకు తీశారు. ఆరో మృతదేహం వరంగల్‌కు చెందిన ఏఈ హేమంత్ కుమార్‌గా గుర్తించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.