బ్రేకింగ్‌: ఏపీలో బోటు ప్రమాదం.. ముగ్గురు గల్లంతు

By సుభాష్  Published on  20 Aug 2020 3:00 PM GMT
బ్రేకింగ్‌: ఏపీలో బోటు ప్రమాదం.. ముగ్గురు గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా చింతూరు దగ్గర లాంచీ ప్రమాదం చోటు చేసుకుంది. శబరి నదిలో ఓ లాంచీ వంతెనను ఢీకొట్టింది. దీంతో లాంచీ రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో ఉన్న ముగ్గురు గల్లంతయ్యారు. అయితే ఏజీ కోడేరుకు వెళ్లి తిరిగి వస్తుండగా లాంచీ ప్రమాదానికి గురైంది.

వరద బాధితులకు నిత్యావసరాలు అందించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శబరి నదికి వరద ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ లాంచీ కాకినాడకు చెందిన శ్రీ గోదావరి బోటు (AP NK PB0127)గా గుర్తించారు. ఘటన స్థలానికి అధికారులు, రక్షణ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Boat 2

Boat

Next Story
Share it