తూర్పుగోదావరి జిల్లా : దేవీపట్నం మండలం కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగింది. గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు పర్యాటకులతో వెళ్తున్న పున్నమి టూరిజం సంస్థకు చెందిన లాంచీ మునిగిపోయింది. బోటు లో 50 మంది పర్యాటకలు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం...ప్రమాదంలో పలువురు గల్లంతు అయినట్టు, 14 మంది సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.

సహాయక చర్యల కోసం హుటాహుటిన, విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్, రెండు NDRF, రెండు SDRF బృందాలను పంపినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ను సంప్రదించి పరిస్థితి సమీక్షించారు. హెలికాప్టర్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story