హైదరాబాద్‌లో భారీ పేలుడు
By సుభాష్ Published on 14 March 2020 10:47 AM IST
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కాటేదాన్ వడ్డెర బస్తీలో చెత్తకుప్పలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల కిటికీల అద్దాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా పేలుడు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతికాగా, ఏదైనా రసాయన పదార్థం వల్ల పేలుడు జరిగిందా..? లేక జిలెటిన్ స్టిక్స్ వల్ల పేలుడు జరిగిందా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఇటీవల కూడా చెత్తకుప్పలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
Next Story