బీజేపీ ట్విట్టర్ నెట్‌వ‌ర్క్‌ పటిష్టం, కాంగీది అవ్యవస్థితం

By రాణి  Published on  29 Jan 2020 12:57 PM GMT
బీజేపీ ట్విట్టర్ నెట్‌వ‌ర్క్‌ పటిష్టం, కాంగీది అవ్యవస్థితం

ముఖ్యాంశాలు

  • పొలిటికల్ ట్వీట్లపై పరిశోధన చేసిన టెక్కీ
  • లక్షలాది ట్వీట్లను పరిశీలించిన కుమార్
  • కుమార్ దగ్గర పోగుపడ్డ అతిపెద్ద డేటాబేస్
  • నెట్వర్క్ మ్యాపింగ్ చేసిన కుమార్
  • బిజెపి అంకౌట్ల పటిష్టమైన వ్యవస్థ
  • కాంగ్రెస్ కి అసలు స్ట్రాటజీనే లేదు
  • కాంగ్రెస్ అకౌంట్లలో చాలా తప్పుల తడకలు
  • బిజెపి టాప్ లీడర్స్ ట్వీట్లకు సీడ్ అకౌంట్స్ ఫాలోయింగ్
  • రాహుల్ గాంధీ ట్వీట్లను పట్టించుకోని సీడ్ అకౌంట్స్

హైదరాబాద్ : గడిచిన రెండు నెలల్లో ట్విట్టర్ పోస్టులమీద ఓ రీసెర్చర్ ఇండిపెండెంట్ స్టడీ చేశాడు. తను ఎంచుకున్న అంశం బిజెపి, కాంగ్రెస్ ట్వీట్లు. ఈ రెండు పార్టీలూ ట్వీట్లద్వారా ఎంతమేరకు, ఎలా సమాచారాన్ని, సరికాని సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నాయో అధ్యయనం చేశాడు. ఈ రీసర్చ్ ద్వారా ఆశ్చర్యం గొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు పార్టీలకూ ఈ విషయంలో చాలా వైరుధ్యం ఉంది. బిజెపి ఈ విషయంలో డీసెంట్రలైజ్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ విషయంలో అసలు సరైన విధానమే లేదని తేలింది. అయితే రెండు నెట్వర్క్ లూ వ్యాప్తి చేస్తున్న సమాచారం మాత్రం హెచ్చుగానే ఉంది. రెండూ చాలా సందర్భాల్లో ఒకే విషయంలో పోటీపడడాన్నికూడా ఈ అధ్యయనంలో గమనించారు.

కుమార్ అనే పేరుగల రీసెర్చర్ చాలా ఓపికతో ఈ వివరాలన్నీ అధ్యయనం చేశాడు. ట్విట్టర్ పొలిటికల్ అకౌంట్ల ద్వారా వ్యాప్తి చెందుతున్న సమాచారం, అలాగే మామూలు అకౌంట్లద్వారా వ్యాప్తి చెందుతున్న పొలిటికల్ సమాచారం, మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ల ట్వీట్లు, మోస్ట్ పాపులర్ పార్టీల ట్వీట్లు లాంటి ప్రముఖమైన అంశాలను మాత్రం పరిగణనలోకి తీసుకుని ఇంతకు ముందే విస్తృత స్థాయిలో సర్వే, అధ్యయనం చేసిన కుమార్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన విషయాలను నిగ్గుతేల్చేశాడు. ఇప్పుడు కుమార్ దగ్గర దాదాపు 170 కోట్ల ట్వీట్ల డాటాబేస్ ఉంది. ఇందులో స్పామ్ గా ట్రీట్ చేసేవి, చెయ్యాల్సినవికూడా బోలెడన్ని ఉన్నాయట. ఇండియాలోని పొలిటికల్ పార్టీలు స్ప్రెడ్ చేస్తున్న స్పామ్ పై కుమార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. ఈ స్టడీకోసం కుమార్ ప్రత్యేకంగా ఓ అల్గరిదమ్ ని డిజైన్ చేశాడు. దాని సాయంతో తేలిగ్గా ట్వీట్లను సెగ్రిగేట్ చేసి అధ్యయనం చేశాడు.

కొన్ని అకౌంట్లలో సమాచారం పుంఖానుపుంఖాలుగా ఇబ్బడిముబ్బడిగా పోస్టైన విషయాన్ని, కొన్ని అకౌంట్లలో ఏళ్ల తరబడి అసలు కదిలే పరిస్థితి కనిపించని వైనాన్ని, ఈ రెండు వైరుధ్యాలనూ కుమార్ స్పష్టంగా, లోతుగా పరిశీలించాడు. ఇంటర్ నెట్ సాయంతో అత్యంత వేగంగా తప్పుడు సమాచారాన్ని, వార్తల్ని ఎలా వ్యాప్తి చెయ్యొచ్చో, చేస్తున్నారో కూడా కుమార్ పక్కాగా లెక్కలతో సహా తేల్చిపారేశాడు.

బిజెపి అకౌంట్లలో సరైన సమాచార వ్యాప్తి

తను డిజైన్ చేసిన అర్గరిదమ్ 2.7 లక్షల అకౌంట్లు బిజెపికి సంబంధించిన సమాచారాన్ని విస్తృతస్థాయిలో వ్యాప్తి చేసినట్టు తెలిపింది. ఈ డేటా సాయంతో నెట్వర్క్ మ్యాపింగ్ కూడా చేసేశాడు ఈ టెక్కీ. బిజెపి నెట్వర్క్ మ్యాప్ లు చాలా పటిష్టంగా, పద్ధతి ప్రకారం ఉన్నాయట. వీటిలో సమాచారం అంచెలంచెలుగా కరెక్ట్ గా వ్యాప్తి చెందిందని చెబుతున్నాడు. కానీ కాంగ్రెస్ నెట్వర్క్ మ్యాప్ అత్యంత అధ్వాన్నంగా ఉందని, సమాచారం ఎక్కడ్నుంచి ఎక్కడికి ఎలా వెళ్తుందోకూడా తెలియడం లేదని కుమార్ కనిపెట్టాడు. కానీ బిజెపి అకౌంట్లకు ధీటుగా కాంగ్రెస్ అకౌంట్లుకూడా సమాచారాన్ని పెద్దమొత్తంలోనే వ్యాప్తి చేస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. అయితే కాంగ్రెస్ అకౌంట్లు, కాంగ్రెస్ ఫాలోయెర్ల అకౌంట్లు ఎక్కువగా ఫేక్ సమాచారాన్ని తోసిపారేస్తున్నట్టుగా తేలిందని కుమార్ చెబుతున్నాడు.

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్ రాహుల్ గాంధీ ట్వీట్లను సీడ్ అకౌంట్లు అస్సలు ఫాలో అవడం లేదని అధ్యయనంలో తేలింది. కానీ బిజెపిలో కింగ్ పిన్ ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్లను, హోం మినిస్టర్ అమిత్ షా ట్వీట్లను, మిగతా బిజెపి బడానేతల ట్వీట్లను సీడ్ అకౌంట్లు పూర్తిగా ఫాలో అవుతున్నాయని, ఆ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, మొత్తం జాతీయ స్థాయిలో చాలా బలంగా ఉందని కుమార్ చెబుతున్నాడు.

Next Story